ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదు 

పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ క్లియర్ చేశాం 

ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదు 

మిగిలిన పెండింగ్ బిల్స్ త్వరితగతిని చెల్లిస్తాం 

లోకల్ గైడ్ హైదరాబాద్, ప్రతినిధి :
ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదని,ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదివేల కోట్ల బకాయిలను చెల్లించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అర్థం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్లిందని, గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని వివరించారు. పాత, కొత్త పెండింగ్ బిల్స్ 10,000 కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. మరో ఎనిమిది వేల కోట్ల బకాయిలు  మిగిలి ఉన్నాయి అని వివరించారు. రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల 500 నుంచి 600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఉండేదని వివరించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతభత్యాలు చెల్లిస్తున్నామని, రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది (ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్) సిబ్బంది ఉన్నారని తెలిపారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర బిల్లును మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అర్ధికేతర సమస్యలు పరిష్కరించడానికి వివిధ క్యాబినెట్ సభ్యులు ఉన్నాయని ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్, వైద్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.