బౌండ‌రీ నుండి బాక్సాఫీస్ కు వార్న‌ర్...

 బౌండ‌రీ నుండి బాక్సాఫీస్ కు వార్న‌ర్...

లోకల్ గైడ్ : 

నితిన్‌ హీరోగా నటిస్తున్న 'రాబిన్‌హుడ్‌' సినిమా నుంచి క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.'భీష్మ' తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటించిన చిత్రం.ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్, ఇప్పుడు సినీ ఫీల్డ్ లో అడుగుపెడుతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'రాబిన్ హుడ్' సినిమాలో వార్నర్ స్పెషల్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా స్టార్ క్రికెటర్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'ఫ్రమ్‌ బౌండరీ టూ బాక్సాఫీస్‌' అంటూ ఇండియన్ సినిమాలోకి డేవిడ్ వార్నర్‌కు గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పింది 'రాబిన్ హుడ్' టీమ్. గ్రౌండ్ లో తనదైన ముద్ర వేసిన తర్వాత, ఇప్పుడు అతడు వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అద్భుతమైన అతిధి పాత్రలో భారతీయ సినిమాకు వార్నర్‌ను పరిచయం చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వార్నర్ లుక్‌ అటు క్రికెట్‌ ప్రియులను, ఇటు మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?