రేసింగ్ ట్రాక్‌పై నాగ చైత‌న్య‌,శోభిత లుక్స్

జంట బాగుందిగా అంటూ కామెంట్స్

రేసింగ్ ట్రాక్‌పై నాగ చైత‌న్య‌,శోభిత లుక్స్

లోకల్ గైడ్:

ప్ర‌స్తుతం టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో నాగ చైత‌న్య‌, శోభిత జంట ఒక‌టి.స‌మంత నుండి విడిపోయాక నాగ చైత‌న్య కొన్ని నెల‌ల పాటు శోభిత‌తో ప్ర‌స్తుతం టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో నాగ చైత‌న్య‌, శోభిత జంట ఒక‌టి.స‌మంత నుండి విడిపోయాక నాగ చైత‌న్య కొన్ని నెల‌ల పాటు శోభిత‌తో ప్రేమాయ‌ణం న‌డిపి గ‌త ఏడాది వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్ళైన‌ప్ప‌టి నుండి వీరిద్ద‌రు చాలా స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషించే శోభిత ఎప్పటిక‌ప్పుడు వాటికి సంబంధిచిన ఫోటోస్ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ జంట ఆమ్‌స్టర్‌‌డామ్ , మెక్సికోలలో వీధి వీధి తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుండి సాయంత్రం వరకు ఎలా గడిపారో ఫోటోల ద్వారా తన అభిమానులకు తెలియ‌జేసింది.అయితే తాజాగా ఈ జంట రేసింగ్ ట్రాక్‌పై సంద‌డి చేసింది. తండేల్ సక్సెస్ తర్వాత నాగచైతన్య, శోభిత దంపతులు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండ‌గా, ఈ క్ర‌మంలోనే కార్ రేసింగ్ ట్రాక్ వద్ద తమ డేను సరదాగా గడిపారు.చై, శోభిత కలిసి రేసింగ్ ట్రాక్‌లో గడిపిన క్షణాలను శోభిత సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. కాగా, చైతన్యకి రేసింగ్ అంటే చాలా ఇష్టం . అందుకే శోభితను సైతం అక్కడకు తీసుకెళ్లారు. ఆమెతో సరాదాగా రేసింగ్ కారు నడిపారు. అంతే కాదండోయ్.. నాగ చైత‌న్య‌ తనకు ఇష్టమైన రేసింగ్ కారులో శోభితను కూర్చోబెట్టి ఫోటోలు దిగ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక‌ ఇటీవలే ఈ కపుల్ యూరప్ ట్రిప్ ఎంజాయ్ చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.