జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేస్తాం.

మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో మూడోస్థానం.

జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేస్తాం.

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి.

లోకల్ గైడ్ తెలంగాణ,నల్లగొండ  జిల్లా బ్యూరో:

రాజకీయాలలో మహిళలను ముందంజలో ఉంచేందుకు జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి విధంగా పనిచేస్తున్నామని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి అన్నారు.శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా కాంగ్రెస్ రివ్యూ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో జిల్లా మూడో స్థానంలో ఉందని తెలిపారు. మహిళా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలలో చోటు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. మరికొందరికి త్వరలోనే అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళలను రాజకీయంగా చైతన్యవంతం చేసి సభ్యత్వం ఇచ్చేందుకు మెంబర్ షిప్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా మహిళా కాంగ్రెస్ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చిన విజయవంతం చేసే దిశగా పనిచేయాలని కోరారు.చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ ను అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. దీనిపై త్వరలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళలకు చట్ట సభలలో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News