మాల ఎమ్మెల్యేలు వర్గీకరణలో మాలలకు ఉప కులాలకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ లో ప్రశ్నించాలి

జాతి ద్రోహులుగా మిగిలిపోవద్దు

మాల ఎమ్మెల్యేలు వర్గీకరణలో మాలలకు ఉప కులాలకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ లో ప్రశ్నించాలి

18 న మాలలు వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపు
18న అసెంబ్లీ ముట్టడి
 లోకల్ గైడ్ ,హైదరాబాద్ ప్రతినిధి :
తప్పుల తడకగా ఉన్న షమీమ్ అక్తర్ కమీషన్ ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ రిపోర్టును శాసనసభ/శాసనమండలి లో మాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎండగట్టాలని మాలలకు ఉపకులాలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య కోరారు. ఈరోజుకు గ్రామీణ ప్రాంతాలలో మొదటి తరం విద్యను అభ్యసిస్తున్న దళితులను ఈ వర్గీకరణ ఏ విధంగా అభివృద్ధిలోకి తెస్తుందని సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎంపరీకల్ డేటా లేకుండా కులాల వారీగా గ్రూపులుగా విభజించిన విధానం రాజ్యాంగ విరుద్ధమని జేఏసీ నేతలు పేర్కొన్నారు .ఈ వర్గీకరణ ద్వారా ఆయా గ్రూపులలోని కులాల మధ్య కొంతకాలం తర్వాత సూక్ష్మ వర్గీకరణకు డిమాండ్ వస్తుందని తద్వారా దళిత జాతి మరింత విచ్చిన్నం అవుతుందని మనువాదులకు కావాల్సింది ఇదేనని, దీనిని మందకృష్ణ అమలు చేయడానికి పూనుకున్నారని చెన్నయ్య పేర్కొన్నారు.మందకృష్ణ మాదిగ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్స్ విడుదల చేసిన తరువాత వాటిలో మార్పు చేయడం కుదరదని మందకృష్ణకు తెలియదా అని ఆయన పక్కన ఉండి మాట్లాడే విటల్ , పృథ్వీ లాంటి వాళ్లకు తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి తెలియదా అని, బిజెపి మెప్పుకోసం  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని వారికి సూచించారు.మందకృష్ణకు చేతనైతే బీజేపీతో కొట్లాడి కేంద్రంలో బిల్లు పెట్టించి దేశవ్యాప్త వర్గీకరణ చేయిస్తే తప్ప రాష్ట్రాలు ఓటు బ్యాంకు కోసం చేసే వర్గీకరణ భవిష్యత్తులో నిలబడదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు.ఈ నెల 18 న అసెంబ్లీలో ప్రవేశపెట్టే వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలలు నిరసనలు చేపట్టాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో మాల సంఘాల జేఏసీ కో చైర్మన్ లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్, జంగా శ్రీనివాస్, మన్నె శ్రీధర్ రావు, నాను, జేఏసీ నాయకులు సత్యనారాయణ, తాలూకా రాజేష్, శ్రీమతి సరళ, శ్రీమతి రమ తదితరులు పాల్గొని ప్రసంగించారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.