మీ టెన్త్ పాసే...నాకు బర్త్ డే గిఫ్ట్
కేశంపేట మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి
బర్త్‌డేను పురస్కరించుకొని టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
లోకల్ గైడ్:
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులు.... టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ పాస్ కావడమే నాకు మీరు ఇచ్చేబర్త్డే గిఫ్ట్ అని కేశంపేట మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పేర్కొన్నారు . సోమవారం మండల పరిధిలోని పాపిరెడ్డి గూడ, వేముల నర్వ, కేశంపేట, నిరుద వెళ్లి, కాకునూర్, కొండారెడ్డి పల్లి, ఎక్లాస్ ఖాన్ పేట్,కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థులతోపాటు కేశంపేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినీలకు పరీక్ష ప్యాడ్ లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మాట్లాడారు . విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని సూచించారు బోర్డ్ ఎగ్జామ్స్ ఆడుతూ పాడుతూ రాయాలని సూచించారు. ఒత్తిడికి లోను కాకుండా పాఠ్యాంశాలు నేర్చుకోవాలని వివరించారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉంటుందని రేపటి భవిష్యత్ మీరేనని విద్యార్థులలో ప్రేరణ నింపారు. విద్యార్థుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేశారు. జన్మదిన సందర్భంగా విశాల శ్రావణ్ రెడ్డిని ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు.
Comment List