అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం:
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, పరిశీలించి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అన్నారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన బేతిని అప్పారావు చీపురికుంట చెరువు (సర్వే నెంబర్ 280 లో 6 ఎకరాల 1 గుంట)కు నిధులు కేటాయించి పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, రక్షణ కల్పించుటకు చర్యలు తీసుకోవాలని కోరగా మండల తహసిల్దార్, నీటి పారుదల శాఖ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రఘునాథ పాలెం మండలం మంచుకొండ గ్రామానికి చెందిన టి. శ్రీనివాస్ రావు తన సంతకం ఫోర్జరీ చేసి సర్వ్ నెంబర్ 284 లో 38 గుంటల తప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి పాస్ బుక్ పొందటంపై విచారణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ రఘునాథపాలెం మండలంకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.సింగరేణి మండలానికి చెందిన సయ్యద్ చాంద్ పాషా సర్వే నెంబర్ 161 నందు ఉన్న పట్టా భూమిలో 1981 సంవత్సరంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నానని, ఈ ఇంటి స్థలం నిషేదిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఇట్టి ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
Comment List