డోనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం..
లోకల్ గైడ్:
మీడియా ముందే..వైట్‌హౌజ్‌లోని ఓవల్ ఆఫీసులో..ట్రంప్,జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆ ఘటన పట్ల క్షమాపణ చెప్పేందుకు జెలెన్‌స్కీ నిరాకరించారు.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అంశంపై మాట దాటవేశారు.న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య..వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జరిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది.ఓవల్ ఆఫీసులో ఆ ఇద్దరు నేతలు మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. ఖనిజాలపై ఒప్పందం చేసుకునేందుకు దౌత్యపరమైన పర్యటన చేపట్టిన జెలెన్‌స్కీ..ఆ ఒప్పందం కుదుర్చుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.విభిన్న అంశాలపై ట్రంప్,జెలెన్‌స్కీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.రూమ్ అంతా నిండిన మీడియా ముందే ఆ ఇద్దరు నేతలు మాటల యుద్ధం కొనసాగింది.ఆ తర్వాత వైట్‌హౌజ్‌ను వీడి జెలెన్‌స్కీ వెళ్లిపోయారు.జెలెన్‌స్కీకి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఉద్దేశం లేదని ట్రంప్ పేర్కొన్నారు.అయితే ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత..అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్‌కు వెళ్లి జెలెన్‌స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.వైట్‌హౌజ్‌లో తన ప్రవర్తనను సమర్థించుకున్నారు జెలెన్‌స్కీ.చెడు చేయలేదన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.ఫాక్స్ న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ..క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు.అమెరికా ప్రజల్ని అమర్యాదపరిచారా,మీరేమైనా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నలను జెలెన్‌స్కీ దాటవేశారు.తన పర్యటన పట్ల అమెరికా చేసిన ఏర్పాట్లను జెలెన్‌స్కీ ప్రశంసించారు.వ్యూహాత్మక భాగస్వామ్యుల మధ్య చాలా గాఢమైన చర్చలు అవసరం అని ఆయన పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో చాలా హుందాగా,నిజాయితీగా ఉండాలని,ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవాలన్నారు.
Comment List