మహిళలు క్రీడా పోటీలలో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ 

మహిళలు క్రీడా పోటీలలో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

లోకల్ గైడ్ ,తెలంగాణ:
కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రిడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రీడా పోటీల కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మహిళ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి విజయాలను సాధించాలన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో మాహిళలు సమాన హక్కులు పొందాలని, క్రీడల్లోనూ వారిది విశేషమైన స్థానం అని అన్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని, మహిళా శక్తిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మహిళలతో కలిసి చెస్, క్యారం, టెన్నిస్ ఆటలను ఆడారు. వివిధ క్రీడా విభాగాల్లో అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, మహిళలు, నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్స్ నందకుమార్, పోతన్న, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం.  . మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
ఐద్వా ఆవిర్బవా దినోత్సవంసందర్బంగా నల్గొండ లో ఐద్వా జెండావిష్కరణ. నల్లగొండ జిల్లా బ్యూరో. లోకల్ గైడ్ న్యూస్: మహిళా హక్కుళా సారధి ఐద్వా నిర్వహిస్తున్న పోరాటాలతోనే మహిళా...
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...
బహుజనుల గొంతుక అయిన కవితక్క. 
ఒకే సీజన్లో 7 సెంచరీలు