తెలంగాణ బ్రాండ్ ను విశ్వ వ్యాప్తం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ బ్రాండ్ ను విశ్వ వ్యాప్తం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

లోకల్ గైడ్, హైదరాబాద్:

రాష్ట్రంలో ఉపాధి కల్పనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్షంగా 51వేల మందికి, పరోక్షంగా 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లైఫ్ సైన్సెస్ పరిశ్రమల కు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి... రాష్ట్రాభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు."బయో ఏషియా 2025 " ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ లో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా కోర్సులకు రూపకల్పన చేయబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి... ప్రపంచ పటంలో తెలంగాణ ను ప్రత్యేక స్థానానికి తీసుకెళ్ళింది.ఈ ప్రయాణం ఇప్పుడు మొదలైంది కాదు..రెండు దశాబ్దాల కిందట మొదలైంది..ఈ స్ఫూర్తి తో తెలంగాణ బ్రాండ్ ను విశ్వ వ్యాప్తం చేస్తామని శ్రీధర్ బాబు అన్నారు.లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ను నంబర్ వన్ గా మార్చడం లో "జీనోమ్ వ్యాలీ" పాత్ర కీలకం. "హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్" జీనోమ్ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం.ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణ లో రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం.  పారిశ్రామికవేత్తలకు తెలంగాణ పై ఉన్న నమ్మకం..  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పై ఉన్న భరోసా ను చాటి చెప్పేందుకు ఈ ఒక్కటీ చాలు.పరిశ్రమల ఏర్పాటు తోనే ఆగిపోము. రాష్ట్ర ప్రభుత్వం వారితో కలిసి పని చేస్తుంది. యూనివర్సిటీ లు, స్టార్టప్, పరిశోధన సంస్థ లతో భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహిస్తాం.కొత్త ఆలోచనలకు అండగా ఉంటాం. ఎంఎస్ఎంఈ లను ప్రోత్సహించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి పథంలోకి తీసుకెళ్తాం.ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జనరిక్ మందుల్లో తెలంగాణ వాటా 20 శాతం. వ్యాక్సీన్ల ఉత్పత్తి లో మన వాటా 40 శాతం. 200 కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం.  . మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
ఐద్వా ఆవిర్బవా దినోత్సవంసందర్బంగా నల్గొండ లో ఐద్వా జెండావిష్కరణ. నల్లగొండ జిల్లా బ్యూరో. లోకల్ గైడ్ న్యూస్: మహిళా హక్కుళా సారధి ఐద్వా నిర్వహిస్తున్న పోరాటాలతోనే మహిళా...
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...
బహుజనుల గొంతుక అయిన కవితక్క. 
ఒకే సీజన్లో 7 సెంచరీలు