మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .

 ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి  పాలడుగు ప్రభావతి.

మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం.  .

ఐద్వా ఆవిర్బవా దినోత్సవంసందర్బంగా నల్గొండ లో ఐద్వా జెండావిష్కరణ.

లోకల్ గైడ్,నల్లగొండ :మహిళా హక్కుళా సారధి ఐద్వా నిర్వహిస్తున్న పోరాటాలతోనే మహిళా సాధికారత సాధ్యమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలిపారు.ఐద్వా ఆవిర్బవా  దినోత్సవం సందర్బంగా నల్గొండ దొడ్డికొమురయ్య భవనం వద్ద ఐద్వా జెండాను ప్రభావతి ఎగురావేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 1981 లో సెప్టెంబర్ 12న ఐద్వా ఏర్పడిందని ఇది భారతదేశంలోని ప్రగతిశీల మహిళా ఉద్యమంలో ఒక ప్రముఖ సంస్థగా అవతరించిందని తెలియజేశారు.AIDWA ప్రధానంగా మహిళల హక్కులను, లింగ సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, నిర్దారిత కూలీ హక్కులను, విద్యా మరియు ఆరోగ్య హక్కులను రక్షించడానికి పని చేస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న దని తెలిపారు. ఆర్థిక స్వావలంబన కోసం మహిళల సంఘటిత ఉద్యమాలు నిర్వహించే ఏకైక సంఘం ఐద్వా అన్నారు. లింగ వివక్షను వ్యతిరేకించడం,కూలీ, వ్యవసాయ కార్మిక మహిళల హక్కుల కోసం పోరాటంనిర్వహించడం గృహ హింస నిరోధక చట్టాల అమలు కోసం కృషి చేసిందని అన్నారు. AIDWA దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను తన ఆశయాలకు అనుసంధానించిదని,  ఇది మహిళల సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక పురోగతికి అంకితమై పని చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు వలన పేదరికం, దరిద్రం, నిరుద్యోగం పెరిగి పోయిందన్నారు. మోడీ పాలనలో మహిళాల పైన దాడులు పెరిగి పోయాయాని, మణిపూర్ మహిళలను చిత్రవదలకు గురించేసిన నిందితులను కాపాడటమంటే మహిళా వ్యతిరేక ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. స్త్రీలుతమకు తామే సంగతితం కావాలని, ప్రజాసంఘాలతో, కార్మిక, రైతు, యువత, విద్యార్థుల తో కలిసి మెలిసి పనిచేస్తూ ప్రజల హక్కుళా సాధనకోసం ఉద్యమాలు నిర్మిస్తమాను తెలిపార.  ఈ కార్యక్రమం లో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, పట్టణ జిల్లా కమిటీ సభ్యులు ఉమా, ఐలమ్మ ట్రస్ట్ కన్వీనర్ మేకల వరుణ సభ్యులు బోల్లేపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు