ప్రజావాణి వినతుల త్వరితగతిన పరిష్కారానికి చర్యలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య.
లోకల్ గైడ్ ,హనుమకొండ జిల్లా ప్రతినిధి:
ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 114 వినతులను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతులు అందజేసిన ప్రజలు జిల్లా కలెక్టర్, అధికారులను కోరారు. వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన వినతులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి. గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comment List