ఆందోళన చెందుతున్న రైతన్న.
క్షణక్షణం భయం భయం..!
-ఏమరపాటు వాయించిన ప్రాణాలచే ప్రమాదం.
-నాలుగు రోజులుగా స్పందించని ఏఈ.
లోకల్ గైడ్/తాండూర్:
తమ పొలంలో విద్యుత్ తీగలు క్రిందికి జారి తలకు తాకే ఎత్తులో ఉన్నాయి. క్షణక్షణం భయం భయంగా బ్రతుకుతున్నామని పెద్దేముల్ గ్రామానికి చెందిన "ధర్మిది రాజు" అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమ పొలంలో విద్యుత్ వైర్లు పూర్తిగా తలకు తాకే స్థితిలోకి జారాయని, విద్యుత్ తీగలను పైకి కట్టండి అని గత నాలుగు రోజుల నుండి పెద్దేముల్ మండల విద్యుత్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని అన్నారు. దీంతో పొలం పనులు చేయాలంటే తీగలు వ్యవసాయ పనిముట్లకు తాకే ఎత్తులో ఉన్నాయి. పొరపాటున తగిలితే గనుక ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు గనక చేయకపోతే వర్షాకాలంలో అన్ని పొలాల్లో పంటలు వేస్తారు. అప్పుడు చేయాలన్నా సాధ్యం కాదు. అధికారులు స్పందించి తక్షణమే విద్యుత్ వైర్లను ఒక స్తంభం సాయంతో పైకి కట్టాలని రైతు రాజు విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు. ఎప్పుడు, ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పొలం పనులు చేసుకుంటున్నాము. అనుకోకుండా చేయి పైకి ఎత్తితే విద్యుత్ వైర్లు చేతికి తాకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇంత ప్రమాదం ఉంది అని విద్యుత్ అధికారికి పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత డివిజన్, జిల్లా అధికారులు స్పందించి మండల విద్యుత్ అధికారి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తమ పొలంలో ప్రమాదకరంగా కిందికి జారి ఉన్న విద్యుత్ వైర్లను పైకి కట్టాలని అధికారులను కోరుతున్నాము.
Comment List