.....ఓ శక్తి స్వరూపిణి...... 

.....ఓ శక్తి స్వరూపిణి...... 
-----------------------------------------
దేశం ప్రగతిపథంలో నడవాలంటే విద్యారంగం ప్రగతి సాధించాలంటే మహిళా మూర్తులు విద్యాసంస్థల్లో బోధన శిక్షకులుగా రాణించాల్సిందే
ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని సహనంతో కొండంత ధైర్యంతో ప్రతిక్షణం విద్యార్థులకు చక్కగా పాఠాలను బోధించి చక్కదిద్దే గొప్ప ధైర్యశాలి మహిళా...

సమాజం హితం కోసం అనుక్షణం తపిస్తూ అందరినీ ఆదరించే మహోన్నత స్నేహశీలి మహిళా
విద్యారంగంలో అనుక్షణం విజయవంతంగా రాణిస్తూ
విద్యార్థులందరికీ అండదండగా ఉంటూ అనుక్షణం ఆలోచించే శక్తి స్వరూపిణి మహిళా కన్నవారి కలల రూపమై మెట్టినింటి దీపమై ఆప్యాయతను అందించే చైతన్య మూర్తి మహిళా...

మమకారంతో ప్రేమను పంచుతూ విద్యార్థుల మనస్సును గెలిచే
ప్రేమ మాతృమూర్తి మహిళా
ఆనందపు జల్లులతో  విద్యార్థుల ఆకాంక్షలను చిగురింపజేస్తూ సంబరపడే దయగల ప్రేమ మూర్తి
చదువుల సాగరంలో ప్రతిభను చాటుతూ దేశ కీర్తిని వెలుగెత్తి చాటే వీర వనిత మహిళా...

విద్యారంగా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను సాధించే
ధైర్యశాలి మహిళా అవరోధాలను అవలీలగా అధిగమిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ  అవకాశాలను అందిపుచ్చుకొని అంకితభావంతో అద్భుతాలను సృష్టిస్తూ దేశ అభివృద్దే తన లక్ష్యంగా విజయం సాధించే వీరనారి మహిళా...

కుటుంబ సభ్యుల అండదండలతో అనునిత్యం విద్యార్థి లోకం కోసం శ్రమించే మాతృమూర్తి మహిళా
ప్రేమ తత్వంతో మానవత్వాన్ని గెలిపించే మాతృమూర్తి మహిళా 
దేశమంతా గుర్తించేలా,గౌరవించేలా మహిళలందరికీ ప్రేమతో జేజేలు పలుకుదాం...

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News