సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. 

లోక‌ల్ గైడ్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కు రాంగోపాల్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దంటూ నోటీసులు అందించారు. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన రాంగోపాల్‌పేట్ పోలీసులు బన్ని మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. శాంతిభద్రతల దృష్ట్యా శ్రీతేజ్‌ను చూసేందురు రావొద్దని పేర్కొన్నారు. ఒకవేళ బాలుడిని పరామర్శించేందుకు రావాలనుకుంటే తమ సూచనలు పాటించాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే అల్లు అర్జునే బాధ్యత వహించాలని తెలిపారు. శ్రీతేజ్‌ను పరామర్శిస్తారనే ప్రచారం జరగడంతో పోలీసులు నోటీసులు అందజేశారు.గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. కిమ్స్ ఆస్పత్రి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లికి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించగా.. ముందు నాలుగు వారాల మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ చేరుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ సేషన్‌లో హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేడు విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు.. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News