బరితెగిస్తున్న హిజ్రాలు... అరికట్టేది ఎలా?

బరితెగిస్తున్న హిజ్రాలు... అరికట్టేది ఎలా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  రెండు తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు రోజు రోజుకి బరితెగిస్తున్నారు. ఇప్పట్లో బిచ్చగాళ్ళ సంఖ్య కన్నా హిజ్రాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా హిజ్రాలకు ఎలా తెలుస్తుందో గానీ... సెకండ్లలో అక్కడ వాలిపోతున్నారు. సరే కదా అని వాళ్ళ ఆశీస్సులు చాలా మంచివని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ హిజ్రాలు మాత్రం వాళ్ల ఆశీస్సులునే నగదుగా మార్చుకుంటున్నారు. ఒక ఫంక్షన్ కి వెళ్ళిన తరువాత ఎంతపడితే అంత డబ్బును డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కూకట్పల్లి ఏరియాలో హిజ్రాలు గ్రూపుగా ఏర్పడి ఇంట్లోకి వచ్చి ఏకంగా 8000 డిమాండ్ చేశారని... అంత లేవని చెప్పినా కూడా వినిపించుకోకుండా  బంధువుల మధ్య పరువు తీస్తున్నారని ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిత్యం ప్రతిరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలలో హిజ్రాల దోపిడీ పెరిగిపోతుందని ఆయా ప్రాంతాల నివాసులు వాపోతున్నారు. హిజ్రాల మీద ప్రతిరోజు పోలీసులకు కంప్లీట్ చేస్తున్న వాళ్ళు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అని మండిపడుతున్నారు. హిజ్రాలకు పోలీసు అధికారులు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వెళ్లాలంటేనే పోలీసుల కంటే మరీ ముఖ్యంగా హిజ్రాలకే భయపడుతున్నారని... డబ్బులు ఇవ్వమని చెప్తే వాళ్ల ప్రైవేట్ పార్ట్స్ ను నలుగురు మధ్య చూపిస్తున్నారంటూ  ఆందోళన వ్యక్తం చేశారు.  

images (19)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News