తెలంగాణకు రెయిన అల‌ర్ట్ ....

ఈ జిల్లాల ప్రజలకు హెచ్చ‌రిక‌లు ....

తెలంగాణకు రెయిన అల‌ర్ట్ ....

లోక‌ల్ గైడ్ :  
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మెున్నటి వరకు భానుడు తన ప్రతాపం చూపగా.. ఇప్పుడు వరుణుడి వంతైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది.తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెున్నటి వరకు ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. భానుడి భగభగలు తీవ్రమైన ఉక్కపోత, వేడితో ఇబ్బందులు పడ్డారు. అయితే అనుహ్యంగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసి అన్నదాతకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 
అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిశాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. వడగళ్లతో కూడిన వర్షాలు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్