రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ ఎన్నికల సంఘం నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. 

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ ఎన్నికల సంఘం నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. 

లోకల్ గైడ్ తెలంగాణ:
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆమె అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించిన అన్ని నియమాలు,ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఎజెంట్లుగా నియమించుకోవాలని, ఎజెంట్ల బాధ్యతలు, హక్కులను తెలియజేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 లకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందన్నారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించడం జరిగిందని, ఓటర్లు తమ పేరు, చిరునామా, తదితర వివరాలు సవరించుకుకోవాలనుకుంటే తహసిల్దార్, మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాల్లో తమ దరఖాస్తులను ఇవ్వవచ్చునన్నారు. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకే ఓటరు ఇతర చోట్ల ఓటు హక్కు ఉన్న, నకిలీ ఓటర్ల ఏరివేత ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యల్లో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, బిజెపి, టిడిపి, వైఎస్సార్ సిపి, ఎంఐఎం ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతినిధులు కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, రమేష్, నరేష్, మజార్, షేక్ హైదర్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం