రితి పుట్టినరోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం
లోకల్ గైడ్ తెలంగాణ:
జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిలువ నీడలేని నిరాశ్రయులకు అనాధలకు చిన్న పిల్లలకు రిది పుట్టినరోజు సందర్భంగా తల్లితండ్రులు శ్రీమతి జక్కుల లేఖ శ్రీ ,పరమేష్ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి చిట్టితల్లి రిది జన్మదిన వేడుకలు జరిపించారు.ఈ కార్యక్రమాన్ని జనగామ రైల్వేస్టేషన్ బస్టాండ్, గిర్ణిగడ్డ, బ్రిడ్జి కింద, తహసీల్దార్ ఆఫీసు దగ్గర మరియు నిరుపేద కుటుంబాల వద్ద చిన్న పిల్లలకు,వృద్దులకు రోడ్డు సైడ్ నివాసిస్తున్నటువంటి వారికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమ్ రాజ్ మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రితి చిట్టి తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహించిన అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు అమ్మ ఫౌండేషన్ టీమ్ సభ్యులు మద్దెల కార్తిక్,బింగినర్సింహులు,మహమ్మద్ ఆఫ్రొజ్,మహమ్మద్ యాకూబ్, బోయిని నాగరాజు,డికొండ గణేష్,మరియు తదితరులు పాల్గొన్నారు, జనగామ అమ్మ ఫౌండేషన్ ఆలోచనలో భారతదేశంలో ఆకలి చావులు లేకుండా నియంత్రణే లక్ష్యంగా ఇప్పుడున్న యువత ప్రజలు మీ మీ గ్రామాలలో పట్టణాలలో నిలువ నీడలేని నిరాశ్రయులకు అక్కున చేర్చుకొని ఆహారాన్ని ఉండడానికి నీడను అందించి మనవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
Comment List