గాజాలో హింసకు పూర్తి బాధ్యత అమెరికాదే

గాజాపై ఇజ్రాయిల్‌ మారణకాండకు సిపిఎం ఖండన పోతినేని, నున్నా

గాజాలో హింసకు పూర్తి బాధ్యత అమెరికాదే

లోకల్ గైడ్ తెలంగాణ:

గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు మళ్ళీ చేయటంపైన సిపిఎం ఖమ్మం జిల్లా కమిటి తీవ్రంగా ఖండిరచింది. గురువారం దాడులకు నిరసనగా నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనం నుండి ప్రదర్శన బయలుదేరి ఎన్‌.ఎస్‌.పి. క్యాంప్‌లోని నిర్మల్‌ హృదయ్‌ స్కూల్‌ సెంటర్‌ వరకు జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ పాల్గొని మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడుల వలన 413 మంది పాలస్తీనీయులు మరణించారని, అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్‌ మరోమారు గాజాపై మారణకాండకు తెగబడిరదని విమర్శించారు. రంజాన్‌ మాసంలో భీకర వైమానిక దాడులతో విరుచుకుపడి పాలస్తీనీయుల ప్రాణాలు హరించిందని అన్నారు. హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా రాత్రి వేళల్లో విచక్షణారహితంగా భూతల, వైమానిక దాడులకు పాల్పడిరదని తెలిపారు. ఈ దాడుల్లో పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో మృతి చెందారని తెలిపారు. మృతిచెందినవారిలో సామాన్యులే అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. ఇజ్రాయెల్‌కు పూర్తి నైతిక, ఆయుధ శక్తి సామర్థ్యాలను సమకూర్చి వెనుక నుండి ట్రంప్‌ ప్రభుత్వమే గాజాలో హింసా కాండకు కారణమైందని విమర్శించారు. అమెరికా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆర్థిక, రాజకీయ మద్ధతు ఇవ్వడం ద్వారా ఇజ్రాయిల్‌ను ఉసిగొల్పి గాజాను అమెరికా నాశనం చేసిందని విమర్శించారు. ఇజ్రాయిల్‌ చర్యల వలన మరో విడత ఉద్రిక్తతలు మొదలయ్యాయని అన్నారు.  ప్రతి ఒక్కరూ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్నారు. మేధావులు, అభ్యుదయకాముక శక్తులు, ఐక్యరాజ్యసమితి గాజాలో ప్రజలకు రక్షణగా నిలబడాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు వర్గాలు పాటించేలా చూడాలని కోరారు.పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణహోమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌), ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గాజాపై ఇజ్రాయిల్‌ చేసిన వైమానిక దాడుల ఫలితంగా మహిళలు, పిల్లలతో సహా 400 మందికి పైగా పాలస్తీనీయులు దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 నాటి నుండి పాలస్తీనీయుల మరణాల సంఖ్య 62 వేలు దాటిందని వీరిలో అత్యధికులు అమాయక పౌరులేనని విచారం వ్యక్తం చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ మారణకాండను ఆపేలా ఇజ్రాయిల్‌ను కట్టడి చేయాలని, తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాడుల పట్ల భారత ప్రభుత్వం మౌనం పాటించడం సరైంది కాదని అన్నారు. భారత ప్రభుత్వం మౌనం వీడాలి, కొనసాగుతున్న హింసను ఖండిరచాలి. పాలస్తీనా ప్రజలకు సిపిఎం పార్టీ సంఫీుభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లాకమిటి సభ్యులు నందిపాటి మనోహర్‌, ఖమ్మం 1టౌన్‌ కార్యదర్శి నాగుల్‌మీరా, 2 టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, జిల్లా నాయకులు ఆర్‌.ప్రకాష్‌, నర్రా రమేష్‌, ముదాం శ్రీను, చెరుకుమల్లి కుటుంబరావు, సదానందం, చింతల రమేష్‌, నామా లక్ష్మినారాయణ, పారుపల్లి కృష్ణారావు, దేవళ్ళ వీరబాబు, పాపారావు, యర్రా రంజిత్‌, హిమాం, శీలం వీరబాబు, లక్ష్మినారాయణ,  నర్సింగరావు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం