రెండోస్థానికి దూసుకెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌..! ఎనిమిదో ప్లేస్‌కి దిగజారిన సన్‌రైజర్స్‌..!

రెండోస్థానికి దూసుకెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌..! ఎనిమిదో ప్లేస్‌కి దిగజారిన సన్‌రైజర్స్‌..!

లోక‌ల్ గైడ్ :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 సీజన్‌ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 13 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో పలు జట్లు మూడేసి చొప్పున మ్యాచులు ఆటగా.. మరికొన్ని జట్లు రెండేసి మ్యాచులు ఆడాయి. 18వ సీజన్‌లో పాయింట్ల పట్టికలో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో నాలుగు పాయింట్లు సాధించి పాయింట్స్‌ టేబుల్‌లో రెండోస్థానానికి చేరింది. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మూడు మ్యాచుల్లో రెండు ఓటములు, ఒక విజయంతో అట్టడుగుకు చేరింది.
ఐపీఎల్‌లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి మ్యాచ్‌ని గెలిచింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ నాలుగోసారి తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించడం విశేషం. అంతకు ముందు 2014, 2017, 2023 సీజన్లలో మాత్రమే తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.ఇక రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్నది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మూడోస్థానంలో ఉన్నది. అయితే, రెండు జట్లు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాయి. ఆయా జట్ల ఖాతాల్లో రెండేసి పాయింట్లు ఉండగా.. మెరుగైన రన్‌ రేట్‌ కారణంగా ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. ఆర్‌సీబీ ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు +2.266 రన్‌ రేట్‌ను కలిగి ఉంది. ఇక ఢిల్లీ నాలుగు పాయింట్లతో పాటు +1.320 రన్‌ రేట్‌ ఉన్నది. పంజాబ్‌ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు +1.485 రన్‌ రేట్‌తో రెండోస్థానంలో ఉన్నది. ఇక గుజరాత్‌ నాలుగు, ముంబయి ఇండియన్స్‌ ఐదు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆరు, ఎస్‌ఆర్‌హెచ్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నది. అయితే, ఐపీఎల్‌లో తొలి రౌండ్‌ ముగిసే వరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కొనసాగిన హైదరాబాద్‌ రెండు మ్యాచుల్లో ఓటమి కారణంగా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ ఖాతాలో కేవలం 2 పాయింట్లు ఉండగా.. -1.112 రన్‌ రేట్‌ ఉన్నది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ తొమ్మిది, కేకేఆర్‌ పదో స్థానంలో నిలిచాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News