ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు. 

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్. 

ప్రభుత్వ నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు. 

లోకల్ గైడ్ తెలంగాణ:
జిల్లాలో ప్రభుత్వ నియమాలను పాటించని పలు రైస్ మిల్లుల యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తెలిపారు. ప్రభుత్వానికి సమయానికి ధాన్యం అందివ్వని రైస్ మిల్లర్లు, అధికారుల తనిఖీల్లో ధాన్యం నిల్వలో తేడాలు ఉన్న 9 రైస్ మిల్లులను జప్తు చేసి, చట్ట ప్రకారం కేసులను నమోదు చేసినట్టు తెలిపారు.  ధాన్యానికి సంబంధించి 38 కోట్ల రూపాయల విలువైన సిఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని, 20 ఎకరాల రైస్ మిల్లర్ల యజమానుల భూములను బ్లాక్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ధాన్యం బకాయి పడ్డ రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం