పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
జల్లే జయరాజు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు.
మహబూబాబాద్ లోకల్ గైడ్ :
గురువారం రోజున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని ఇంటికన్నె గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి ముద్ర కోళ్ల శ్రీను ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రాస్తారోకోలు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిత్యవసర వస్తువులపై ధరలు పెంచుతూ పేద నిరుపేద మధ్యతరగతి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు 41% తగ్గిన భారతదేశంలో ఒంట గ్యాస్ ,డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేస్తుందని అన్నారు. దేశంలోని ప్రజలు పనులు లేక పస్తులు ఉంటుంటే దేశంలో బిజెపి మోడీ బిజెపి ప్రభుత్వం రోజురోజుకు నిత్యవసర సరుకులు ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ సభ్యులు పుట్ట ముత్తయ్య కదిరే రాజు సోమరపు ఎల్లయ్య మరియు వెంకటరమణ సావిత్రమ్మ సమ్మక్క మమత రమ చిర్ర మల్లయ్య బెజ్జం వినేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List