అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి తెలిసే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోలేదు. తాజాగా రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ స్పందించింది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నానంతరం నాకు మరో పెళ్లి చేసుకోవాలనిపించినా కూడా కేవలం పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ " నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాను. కానీ అటు రిలేషన్షిప్ కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నానని గ్రహించాను. ప్రస్తుతం నా కూతురు ఆద్యకు 15 సంవత్సరాలు. బహుశా భవిష్యత్తులో ఆమెకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తానేమో అని రేణు దేశాయ్ సమాధానం ఇచ్చారు. దీంతో త్వరలోనే రేణు దేశాయ్ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Comment List