రాజకీయాల్లో చాలా అవకాశాలు వచ్చాయి... ఒకే ఒక్క కారణంతో పక్కన పెట్టేసా?

రాజకీయాల్లో చాలా అవకాశాలు వచ్చాయి... ఒకే ఒక్క కారణంతో పక్కన పెట్టేసా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్:-  నటి రేణు దేశాయ్  రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు నాకు రాజకీయంలోకి వెళ్లే అవకాశాలు చాలానే వచ్చినా కూడా పిల్లల కోసం వాటన్నిటిని వదులుకున్నానని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుందని అన్నారు. కాబట్టే సామాజిక సేవ చేస్తూనే... ప్రతి ఒక్కరి ఆకలి బాధను తీర్చాలని ఉందని పవన్ కళ్యాణ్ భార్య, నటి రేణు దేశాయ్ స్పష్టం చేశారు. ఆకలితో ఏ చిన్నారి కూడా అలమటించకూడదని, కాబట్టి ప్రతి ఒక్క చిన్నారి ఆకలి తీర్చాలన్నదే నా ఆశయం అంటూ చెప్పుకొచ్చారు. లిటిక్స్ అనేవి నా జాతకంలో ఉన్నప్పటికీ విధిరాతకు నేను వ్యతిరేకంగా వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. ఏదైనా సరే ఒక పార్టీలో చేరితే అది మీకు కచ్చితంగా తెలియజేస్తానని అన్నారు. రాజకీయ విషయాలను ఎప్పుడూ కూడా రహస్యంగా దాచలేదని స్పష్టం చేశారు. కాబట్టి రేణు దేశాయ్ ఇప్పటిలో అయితే  రాజకీయ ప్రవేశం చేసే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఆమె జీవితంలో రాజకీయం అనే రాత ఉందో లేదో మరికొన్ని సంవత్సరాలలో తెలిసిపోతుంది. 

images (26)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గురువును ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు. గురువును ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు.
(లోకల్ గైడ్ జడ్చర్ల) కవి,రచయిత వి.జానకి రాములు గౌడ్ ను ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని 2000 లో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆనందాన్ని...
బషీరాబాద్ లో పోషన్ పఖ్వాడ అవగాహన కార్యక్రమం
‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి 
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
* మెగాస్టార్ చిరంజీవిని కలిసి అభినందనలు అందుకున్న ప్రముఖ సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ కుమారుడు దినేష్ మహీంద్ర 
విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలతో  అందరికీ కనెక్ట్  అయ్యే చిత్రం ‘మధురం’ : హీరో ఉదయ్ రాజ్
రజతోత్సవ సభ పోస్టర్స్ విడుదల చేసిన సభను విజయవంతం చేయాలని