జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల
చిత్ర యూనిట్ కు ఆకాష్ జగన్నాధ్ బెస్ట్ విషెస్ !!!
లోకల్ గైడ్:
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది.ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాధ్ మాట్లాడుతూ...జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. సాంగ్స్ ప్రోమోస్ బాగున్నాయి. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comment List