రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం
లోకల్ గైడ్, మహబూబాబాద్
నల్లు సుధాకర్ రెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు ,మతాలు, కులాలు, జాతులను భాషలను ఒక తాటిపైకి తెచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా, బిజెపి తమ స్వంత ఏకపక్ష విధానాలను బరితెగించి అమలు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
కురవి మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా పార్టీ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు,వక్ఫ్ బోర్డుకు సవరణలు లాంటి ప్రధానమైన నిర్ణయాలను ఏకపక్షంగా ఒంటెద్దు పోకడ నిర్ణయాలు ,సమైక్య విధానానికి బంగకరం కలిగించే కేంద్రీకృత విధానాలు, గవర్నర్ వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలైన ఈ డి, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ లను దుర్వినియోగం చేయడం ,ప్రశ్నించే వారిని, ప్రజాస్వామ్య వాదులపై బరితెగించి దాడులను కొనసాగించడం లాంటి విధానాలతో రాజ్యాంగ మూల సూత్రాలకు భంగకరం కలిగించే విధానాలను ప్రజలు సంఘటితంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు తురక రమేష్ బుడమ వెంకన్న కన్నె వెంకన్న నర్సింగo గురవయ్య బొల్లo ఉప్పలయ్య కలగూర నాగరాజు బొల్లు వెంకన్న నిలుగొండ నాగేశ్వరరావు జిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు
Comment List