రింకు సింగ్... ఓడిన.. మా మనసులు గెలిచావోయ్!...
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు కోల్కత్తా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జేయింట్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లకు 238 భారీ పరుగులను నమోదు చేసింది. లక్నో తరుపున నికోలస్ పోరన్ మరియు మిచల్ మార్స్ అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టారు. అయితే 239 పరుగుల లక్ష్య చేతనతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు మొదటినుండే మంచి ఆరంభాన్ని అందుకున్నారు. ఒకానొక దశలో 239 పరుగులను చేదిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ చివరికి నాలుగు పరుగులు తేడాతో కోల్కతా జట్టు ఓటమిపాలైంది. ఇందులో కోల్కత్తా ప్లేయర్ రింకు సింగ్ అందరి మనసులను దోచుకున్నాడు. ఎందుకంటే చివరి ఓవర్ లో 24 రన్స్ చేయాల్సి ఉండగా 19 పరుగులు మాత్రమే చేయగలిగారు. కానీ రింకు సింగ్ చివరి మూడు బంతులు మాత్రమే ఆడి 14 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో మొదటి బాల్ నుండి రింకు సింగ్ కు స్ట్రైక్ వస్తే కచ్చితంగా మ్యాచ్ గెలిపించేవాడు అని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే ఓడిపోయిన కూడా తమ మనసులను గెలిచావు అంటూ చాలామంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Comment List