ఇండియన్‌ సినిమాలో మరో కొత్త అధ్యాయం ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌

స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్‌పిక్చర్‌ భారీ చిత్రం

ఇండియన్‌ సినిమాలో మరో కొత్త అధ్యాయం ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌

లోక‌ల్ గైడ్ : 
భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్‌  అల్లు అర్జున్‌ అభిమానులు ఎదురుచూస్తున్న అత్యంత సన్సేషనల్‌ కాంబో అల్లు అర్జున్‌, స్టార్‌ దర్శకుడు అట్లీ  కాంబినేషన్‌లో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న అత్యంత భారీ చిత్రం, సన్సేషనల్‌ చిత్రం ప్రకటన అధికారికంగా వచ్చేసింది. స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఫస్ట్‌ తెలుగు సినిమా ఇది. కాగా ఏప్రిల్‌ 8 (నేడు) ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ భారీ ప్రకటనను ఎంతో ప్రస్టేజియస్‌గా విడుదల చేసింది. ఇండియన్ సినిమా పరిశ్రమనలొ నూతన ఉత్తేజాన్ని నింపిన ఈ  భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ సన్ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ సమర్పణలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ ఇది. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్‌, హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌, దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ అనౌన్స్‌మెంట్‌ను చేసి అందరిని సంభ్రమశ్చర్యాలకు గురిచేశారు. 
ఇప్పటివరకు టైటిల్‌ ఖరారు కాని ఈ పాన్‌-ఇండియా చిత్రంతో, మూడుముఖ్యమైన సృజనాత్మక శక్తులు ఏకమవుతున్నాయి: భారీ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు అట్లీ (జవాన్, థెరి, బిగిల్, మెర్సల్‌ వంటి చిత్రాలతో ప్రఖ్యాతి గాంచినవాడు); పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పురస్కారం పొందిన  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌; మరియు భారతదేశంలోని అగ్రగణ్య మీడియా సంస్థలలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌కు చెందిన సన్ పిక్చర్స్‌.

ప్రస్తుతం ప్రాజెక్ట్ A22 x A6గా పిలవబడుతున్న ఈ చిత్రం, భారతీయ విలువలతో కూడిన  కథనంతో కూడిన ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కలిగించేలా రూపొందించనున్న ఈ సినిమా, భావోద్వేగాలు, మాస్ యాక్షన్, పెద్ద స్కేలు నిర్మాణంతో ఓ చారిత్రక సినిమాగా నిలవనుందని చెప్పబడుతోంది. ఈ ప్రత్యేక వీడియో చూసిన అందరూ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో ఓ మ్యాజిక్‌ జరగబోతుందని, ఈ చిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, హాలీవుడ్‌ స్థాయి మేకింగ్‌ ఉండబోతుందని అర్థమవుతోంది. సంచలన దర్శకుడు అట్లీ తొలిసారిగా తెలుగులో రూపొందిస్తున్న అంతర్ధాతీయ పాన్‌ ఇండియా సినిమా ఇది. 

ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. నటీనటులు, సాంకేతిక బృందం మరియు విడుదల తేదీ వంటి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి. చరిత్ర నిర్మించబడబోతోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .