ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 

ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 

లోక‌ల్ గైడ్: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'ప్రేమ‌కు జై'. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్ర‌వారం) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌పై చూడ‌ని ఓ ల‌వ్‌స్టోరీని చూపించ‌బోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారాయి. 

ఈ సంద‌ర్భంగా 'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు.
 
అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దుబ్బాక భాస్కర్ విలన్. ఈ చిత్రానికి ఎడిటర్: సామ్రాట్, సినిమాటోగ్రాఫర్: ఉరుకుందా రెడ్డి, సంగీతం: చైతు,  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం రాజేష్, సహ నిర్మాత: మైలారం రాజు, నిర్మాత: అనసూర్య, కథ - దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే