పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ హెల్త్ అప్డేట్!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ కు సింగపూర్ లో నిన్న స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలు అయిన విషయం మనందరికీ తెలిసిందే. సింగపూర్ లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడు హెల్త్ బులిటెన్ తాజాగా విడుదలయ్యింది. పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ ఆరోగ్యం ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నామని డాక్టర్లు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్కు ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో అత్యవసర చికిత్స చేస్తున్నామని సింగపూర్ డాక్టర్లు వెల్లడించారు. కాగా కుమారుడికి ఇలా జరిగిందని తెలియగానే రాత్రికి రాత్రి పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి దంపతులు ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ డాక్టర్లతో మాట్లాడి పవన్ కళ్యాణ్ బాలుడి వివరాలను తెలుసుకున్నారు. కాగా ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకరును జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్లుగా డాక్టర్లు తెలిపారు. మరో మూడు రోజులు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు వెల్లడించారు.
Comment List