ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
•వేసవికాలం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో త్రాగునీరు సరఫరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.
•"రాజీవ్ యువ వికాస పథకం” దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ నమోదు వివరాలను ప్రత్యేక అధికారులు పరిశీలించాలి.
--జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.
మహబూబాబాద్(లోకల్ గైడ్ తెలంగాణ):
సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లాలోని అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కురవి మండలం, రాజోలు గ్రామానికి చెందిన తాటిపాముల వర్ధయ్య తన భార్య ఉపాధి హామీ పనులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిందని ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని దరఖాస్తు చేసారు. గూడూరు మండలం, ఏపూరి గ్రామానికి చెందిన బానోతు చందు మండలంలో అక్రమంగా ఫంక్షన్ హాలు నిర్మించారని దానిపై చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేశారు. తొర్రూరు మండలం కాకతీయ కాలనీకి చెందిన దాసరోజు వినోద తాను నిరుపేద కుటుంబానికి చెందిన వారిని అని రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా తనకు ఉపాధి కల్పించాలని దరఖాస్తు చేశారు. జిల్లాలోని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, రాజీవ్ యువ వికాసం పథకం లో ప్రాధాన్యత కల్పించాలని, గిరిజన జర్నలిస్టు పిల్లలకు ఈఎంఆర్ఎస్ పాఠశాలలో విద్య కల్పించాలని దరఖాస్తు చేశారు. ఈ సోమవారం రెవెన్యూ విభాగానికి చెందిన దరఖాస్తులు (37), డి ఆర్ డి ఏ (5), వ్యవసాయం, (3) బీసీ వెల్ఫే ర్ (2), పంచాయతీరాజ్ (4), ఇలా వివిధ విభాగాలకు చెంది చెందిన మొత్తం (75) దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణవేణి, గణేష్, జడ్పీ సీఈవో పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, బీసీ వెల్ఫేర్ అధికారి ఎం.నరసింహస్వామి, డిసిఓ వెంకటేశ్వర్లు, డివిహెచ్ఓ డాక్టర్ బి.కిరణ్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా నాయక్, డిహెచ్ఓ జి.మరియన్న డిపిఓ హరిప్రసాద్, డిడబ్ల్యూఓ దేశీ రామ్, మెప్మా పీడీ విజయ, డిఎస్ఓ ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డిడబ్ల్యూఓ ధనమ్మ, ఏడి మైనింగ్ వెంకటరమణ, మత్స్యశాఖ అధికారి వీరన్న, జిఎం ఇండస్ట్రీస్ శ్రీమన్నారాయణ రెడ్డి,ఏడి రాజేశం, ఉపాధి కల్పన అధికారి రజిత, ఈడబ్ల్యూఐడిసి డిఈ అరుణ్ కుమార్, మైనారిటీ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేటర్ ఈడి శ్రీనివాస్, ఎల్డిఎం మూర్తి, డిఎం మార్కెటింగ్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్,అన్ని మండలాల నుండి ఉప తహసిల్దార్ లు, మున్సిపల్ మేనేజర్లు, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comment List