ఏప్రిల్ 14 నాటికి జంక్షన్ సుందరీకరణ పనులను పూర్తి చేయండి
సంబంధిత శాఖల అధికారులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాలు.
లోకల్ గైడ్ తెలంగాణ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కుడా ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులను ఏప్రిల్ 14వ తేదీ నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కుడా వైస్ ఛైర్మెన్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్ లతో కలిసి ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ, అభివృద్ధి పనుల పురోగతిపై కుడా, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ, అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జంక్షన్ చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయడం, పచ్చదనం కోసం లాన్, మొక్కలు నాటడం, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ నిర్మాణం, తదితర పనులు నాణ్యతగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, తహసీల్ధార్ జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comment List