అర్హులైన ప్రతి పేదవాడికి సన్నబియ్యాన్ని అందించడం జరుగుతుంది.
శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
లోకల్ గైడ్:
దారుర్ మండలంలోని బుధవారం కేరెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ, ధారూర్ లోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,48,122 రేషన్ కార్డుల ద్వారా 8,52,122 మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు 5,582 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాలు ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అనారోగ్యానికి గురై చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దారూర్ మండలంలో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పథకంలో భాగంగా 94 మంది లబ్ధిదారులకు అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5 లక్షల 65 వేల రూపాయల చెక్కులను 9 మంది లబ్ధిదారులకు స్పీకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, తహసిల్దార్ సాజిదా బేగం, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comment List