ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 వరకు క్రమబద్ధకరణ చేసుకోవాలి

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 వరకు క్రమబద్ధకరణ చేసుకోవాలి

లోకల్ గైడ్ తెలంగాణ:

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుములో 25% మినహాయింపు ఉంటుందని ,మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని  జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ అన్నారు.శుక్రవారము హైదరాబాద్ నుండి ప్రిన్సిపాల్  సెక్రటరి దానం  కిషోర్  జిల్లా కలెక్టర్ లకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై  వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ  100% పూర్తి చేయాలనీ, చెల్లించాల్సిన రుసుములో 25% మినహాయింపు ఉంటుందని ,  అర్బన్, రూరల్, గ్రామా పంచాయతి లలో లే అవుట్ రేగులరైజేషన్  25 % స్కీం పై అవగాహనా కలిపించుకొని , ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని, మార్చి 31 వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని అన్నారు.జిల్లా నుండి వి సి హాలు నుండి జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎల్ ఆర్ ఎస్ అప్లికేషన్ లు 36995 వచ్చాయని, 1130 ఫ్రీ పెయి డ్  చేయడం జరిగిందని, మిగతా వాటిని నెల 31వరకు పూర్తి చేస్తామని అన్నారు.వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా పంచాయతి  అధికారి జయసుధ, మున్సిపల్ కమిషనర్ లు  జాకీర్ అహమ్మద్, విక్రం సింహ రెడ్డి, వెంకటయ్య , వేనుగోపాల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం