అవతార్‌ని మించి అట్లీ
బన్నీ మూవీ.. రోబోలు, జంతువులతో
లోకల్ గైడ్:
AA22 x A6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రోజు రోజుకి పరిధి దాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయిలని దాటేసిన బన్నీ ఇప్పుడు హాలీవుడ్‌పై కన్నేసినట్టు తెలుస్తుంది. AA22 x A6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు రోజు రోజుకి పరిధి దాటుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్ స్థాయిలని దాటేసిన బన్నీ ఇప్పుడు హాలీవుడ్‌పై కన్నేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తాడా అని అందరిలో అనేక అనుమానాలు ఉండగా, వాటికి ఈ రోజు క్లారిటీ వచ్చింది. అట్లీతో చేయనున్నాడని, సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనుందని మేకింగ్ వీడియోతో అర్ధమైంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి AA22xA6 వర్కింగ్ టైటిల్ పెట్టారు. అంటే.. అల్లు అర్జున్ 22వ చిత్రం, అట్లీ దర్శకుడిగా 6వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఎలాంటి కథతో రూపొందుతుంది అనే చర్చ సాగుతుంది. అట్లీ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చాలా ఎనర్జిటిగ్ ఉందని వాస్తవంగా చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి అని హాలీవుడ్ టెక్నీషియన్స్ మేకింగ్ వీడియోలో తెలియజేశారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రానికి లాస్‌ఏంజెల్స్‌కు చెందిన వీఎఫ్‌ఎక్స్ సంస్థ పనిచేస్తోందని వీడియోని బట్టి అర్ధమైంది. ఈ సినిమా సైంటిఫిక్ తరహాలో, ఏలియన్స్, గ్రహాంతరవాసుల నేపథ్యంలో రూపొందనుందని తెలుస్తుంది. వీడియోలో హీరో, దర్శకుడు పలు బొమ్మలని, ఆకారాలని గమనిస్తూ ఉండడం చూస్తుంటే ఈ చిత్రం రెగ్యులర్ మూవీగా ఉండదని, హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని అర్ధమవుతుంది. వీడియోలో అల్లు అర్జున్ ఫేస్‌కి తగ్గట్లుగా 360 డిగ్రీలలో 3D స్కానింగ్ చేయించుకుంటున్నారు. దీని ప్రకారం ఆయన గెటప్ కూడా మారుతుందని తెలుస్తోంది.
Comment List