HCU విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన బట్టి విక్రమార్క!..

HCU విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన బట్టి విక్రమార్క!..

లోకల్ గైడ్, తెలంగాణ :- HCU విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు. కంచ భూముల పరిరక్షణ కోసం నిరసనలు చేసిన  విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించాలని ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. అలాగే జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులపై కేసులోకి సంహరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. కేసుల ఉపసంహరణలో న్యాయపరమైన సమస్యలు రాకుండా న్యాయశాఖ అధికారులే తగిన సూచనలు ఇవ్వాలని వెల్లడించారు. కాగా 400 ఎకరాల HCU పరిధిలోని అటవీ ప్రాంతాన్ని శుభ్రం చేసి పలు రకాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుండి  HCU విద్యార్థులు వన్యప్రాణుల పరిరక్షణ కోసం  ఈ ప్రాంతాన్ని వదిలివేయాలని నిరసనలు చేశారు. కొన్ని వందలాది జంతువులు ఎక్కడికి పోతాయి అని  విద్యార్థులు ర్యాలీలు, నిరసనలు చేశారు. దీంతో వెంటనే  పోలీసులు కొంతమంది విద్యార్థులపై కేసులు నమోదు చేయగా... వాటిని ఎత్తివేయాలని తాజాగా బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 

images (29)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News