IPL ఆరంభంలోనే... వరుణుడు ఎఫెక్ట్!.. మొదటి మ్యాచ్ కష్టమే?
RCB vs KKR మ్యాచ్ రద్దు!
లోకల్ గైడ్ :- ఐపీఎల్ 2025 రేపు ఎంతో ఘనంగా ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్ ఆర్సిబి మరియు కోల్కతా మధ్య జరగాల్సి ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవునుంది. కొన్ని వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఐపీఎల్ తొలి మ్యాచ్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు జరగబోయే కోల్కత్తా మరియు rcb మ్యాచ్ మధ్యలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు మ్యాచ్ జరుగుతున్న వేళ కోల్కత్తా నగరంలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో క్రికెట్ అభిమానులకు మొదటి రోజు నిరాశ చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రేపు కోల్కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకల్లో పంజాబీ గాయకుడు కరణ్, బాలీవుడ్ గాయని శ్రేయ ఘోషల్, బాలీవుడ్ నటి దిశ పటాని సందడి చేయనున్నారని ప్రకటించింది. ఇక టాస్ కు గంట ముందు సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక అనేది ఘనంగా ప్రారంభం అవుతుందని తెలిపారు. మరి ఎంతో ఘనంగా ప్రారంభమవుతున్న సందర్భంలో వర్షం ప్రభావం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడిందంటే మాత్రం మ్యాచ్ రద్దువడమే కాకుండా ఓపెనింగ్ వేడుకలు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది.
Comment List