ఉల్లాసంగా.. ఉత్సాహంగా... చిరునవ్వుతో భూమ్మీదకు అడుగుపెట్టిన సునీత విలియమ్స్!.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా...  చిరునవ్వుతో భూమ్మీదకు అడుగుపెట్టిన  సునీత విలియమ్స్!.

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలపాటు స్పేస్ లోనే ఉండి నేడు ఉల్లాసంగా... ఉత్సాహంగా.. చక్కటి చిరునవ్వుతో భూమ్మీదకు అడుగు పెట్టింది మన ఆడబిడ్డ సునీత విలియమ్స్. వ్యోమగామి సునీత విలియమ్స్ కేవలం ఎనిమిది రోజుల స్పేస్ పర్యటనకు వెళ్లి ఏకంగా 285 రోజులపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే నేడు సునీత విలియమ్స్ చిరునవ్వుతో భూమ్మీదకి అడుగు పెట్టింది.  క్యాప్సూల్స్ నుంచి బయటకు వస్తూ సునీత విలియమ్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంతో ఆనందంగా బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  గత సంవత్సరం జూన్ 5వ తారీఖున సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వెళ్లడం జరిగింది. వారంలోనే అంటే ఏడు లేదా ఎనిమిది రోజులలో తిరిగి రావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు ఇవాల్టి వరకు అనగా 9 నెలల పాటు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. నేడు భూమి మీదకు తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ కు ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుల నుండి రాజకీయ ప్రముఖుల వరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచంలోని ప్రజలంతా స్వాగతం పలుకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాలుగా పోస్ట్లు పెడుతున్నారు. సునీత విలియమ్స్ కు ప్రశంసలతో సోషల్ మీడియా అంతటా కూడా షేక్ అవుతుంది. IMG-20250319-WA0009

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం