హోలీ పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి..ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు
ఎస్సై జక్కుల పరమేష్
లోకల్ గైడ్ తెలంగాణ,శాయంపేట:
హోలీ పండుగని పురస్కరించుకొని, శాయంపేట మండల ప్రజలందరికి 'హోలీ' పండగ శుభాకాంక్షలు ఎస్సై జక్కుల పరమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. యువకులు మద్యం సేవించి హోలీ ఆడుతూ, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడద్దని, అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని యువకులకు సూచించారు. సాంప్రదాయమైన రంగులతో హోలీ ఆడాలని చిన్నపిల్లలకు, మహిళలకు, యువతులకు సూచించారు. హోలీ పండుగ అనంతరం చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్లొద్దని, వెళ్లి ప్రమాదాల బారిన పడద్దని తెలిపారు. పండుగ వేళ ఎవరితోనైనా గొడవలు పడిన, అల్లర్లకు పాల్పడిన, మహిళలని వేధింపులకు గురిచేసిన, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చట్టరీత్య చర్యలు తీసుకొని కేసులు పెడతామని హెచ్చరించారు. నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు పర్యావేక్షణలో ఉన్నాయని గుర్తు చేశారు.
Comment List