హోలీ పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి..ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు  

ఎస్సై జక్కుల పరమేష్ 

హోలీ పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి..ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు  

 లోకల్ గైడ్ తెలంగాణ,శాయంపేట:

హోలీ పండుగని పురస్కరించుకొని, శాయంపేట మండల ప్రజలందరికి 'హోలీ' పండగ శుభాకాంక్షలు  ఎస్సై జక్కుల పరమేష్  ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. యువకులు మద్యం సేవించి హోలీ ఆడుతూ, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడద్దని, అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించద్దని యువకులకు సూచించారు. సాంప్రదాయమైన  రంగులతో హోలీ ఆడాలని చిన్నపిల్లలకు, మహిళలకు,  యువతులకు సూచించారు. హోలీ పండుగ అనంతరం చెరువుల దగ్గరికి,  బావుల దగ్గరికి వెళ్లొద్దని, వెళ్లి ప్రమాదాల బారిన పడద్దని తెలిపారు. పండుగ వేళ ఎవరితోనైనా గొడవలు పడిన, అల్లర్లకు పాల్పడిన, మహిళలని వేధింపులకు గురిచేసిన, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చట్టరీత్య చర్యలు తీసుకొని కేసులు పెడతామని హెచ్చరించారు. నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు పర్యావేక్షణలో ఉన్నాయని గుర్తు చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి