ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025.

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి.

ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్   నందు జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం.

ముఖ్యతిదిగా జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి.

లోకల్ గైడ్ తెలంగాణ,నల్లగొండ జిల్లా  బ్యూరో:

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ప్రారంభించి,జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు.అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్  ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్ళినప్పుడు బందోబస్తుగా వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అంటేనే ఒత్తిడి తో కూడుకున్న ఉద్యోగం అని అన్నారు.పోలీస్ శాఖ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావాలని అందుకోసం క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల ద్వారా సమతుల్యమైన శారీరక మానసిక అభివృద్ధి పొందుతుందని అన్నారు. పోలీస్ శాఖ కు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమన్నారు. నిత్యం విధినిర్వహణలో ఒత్తిడిలో ఉండే పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మంచి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. తమకు అవసరమైన విషయాలను కూడా పోలీస్ శాఖ లోని ముఖ్యమైన విభాగాల నుంచి సమాచారం తెప్పించుకుని దానికి అనుగుణంగా ప్రణాళికతో పనిచేస్తామన్నారు. క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ మీట్లో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులకు మరియు సిబ్బందికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయి ఇవి నిత్యజీవితంలో భాగంగా చేసుకొంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం కలిగి ఉంటుందని ఇవి ముఖ్యంగా పోలీసు శాఖలో వివిధ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఎంతగానో దోహదపడతాయి అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని క్రీడాకారులందరూ స్పోర్స్ స్పిరిట్ తో ఆడాలని అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయని వాటిని తట్టుకునేందుకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు ఓటమిని అంగీకరించి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలి అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జీవితాంతం ఇదే ఫిట్నెస్ను కొనసాగించాలని సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యం కోసమే గేమ్స్ తో పాటు పరేడ్,జిమ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. ప్రతి ఒక్కరికీ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ గా ఉండాలని ఏంచుకోవాలని అన్నారు.  ఈ పోటీలలో నల్లగొండ,మిర్యాలగూడ,దేవరకొండ డివిజన్ల తోపాటు నల్లగొండ ఏ.ఆర్ విభాగం జట్లు కూడా ప్రాతినిధ్యం వహించాయి. సుమారు 300 మంది అధికారులు సిబ్బంది ఈ పోటీలలో పాల్గొనున్నారు.  క్రీడలు మూడు రోజులపాటు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, షాట్ పుట్ తదితర క్రీడాంశాలలో పోటీలను నిర్వహిస్తున్నాన్నారని అన్నారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

టీడబ్ల్యూజేఎఫ్ చేయూత టీడబ్ల్యూజేఎఫ్ చేయూత
* వెలుగు పత్రిక జర్నలిస్ట్ తిరుపతికి వితరణ* రంజాన్ కుటుంబానికి సహాయం* యోగక్షేమాలు తెలుసుకొని అభయం* యూనియన్లకు అతీతంగా సేవలు: టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఖదీర్, శ్రీనివాసరెడ్డి, సాగర్...
ఇది ప్ర‌భాస్ క్రేజ్ అంటే..
హోలీ పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి..ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు  
ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో  వేలం పాట ద్వార 5 లక్షల ఆదాయం 
గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌.ఐ. శివ‌ను సన్మానించిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS
రేవంత్‌ రెడ్డీ.. కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు :