ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి గంభీర్ ఆసక్తి...
లోకల్ గైడ్:
జూన్ నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమ్‌ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా గడిపే సమయంలో భారత ‘ఏ’ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లనుండగా.. ఆ జట్టుతో కలిసి గంభీర్ వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ముందే వెళ్లడం వల్ల రిజర్వ్ బెంచ్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చునని, ఎవరి సత్తా ఏమిటో తెలుసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశమని గంభీర్ అనుకుంటున్నాడు.ఇదే విషయాన్ని అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన వెంటనే బీసీసీఐతో జరిగిన సమావేశంలో చర్చించినట్టు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ గంభీర్ గనక భారత ‘ఏ’ జట్టుతో వెళ్తే అలా వెళ్లిన తొలి హెడ్‌కోచ్‌గా నిలుస్తాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు భారత ‘ఏ’ టూర్లకు రాహుల్ ద్రవిడ్ వెంట వెళ్లేవాడు. ద్రవిడ్ కోచ్ అయ్యాక ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ చూసుకున్నాడు.
Comment List