నేడు ముంబై- గుజరాత్ ఎలిమినేటర్
మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ ముగింపు దశ
లోకల్ గైడ్:
దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్‌లే. లీగ్ దశ మంగళవారమే ముగియగా 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. నేడు ముంబై- గుజరాత్ ఎలిమినేటర్.గెలిచిన జట్టు ఫైనల్‌కు.ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ (టీవీ), జియో హాట్‌స్టార్ (యాప్)లో చూడొచ్చు ముంబై : దాదాపు నెల రోజులుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్‌లే.లీగ్ దశ మంగళవారమే ముగియగా 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది.ఇక తొలి ఎడిషన్ విన్నర్ ముంబై ఇండియన్స్..మూడోసారి ఎలిమినేటర్ పోరుకు సిద్ధమైంది.తొలి రెండు సీజన్లలో ఘోరంగా విఫలమైనప్పటికీ సారథ్య మార్పుతో గుజరాత్ జెయింట్స్ తొలిసారిగా నాకౌట్ దశకు అర్హత సాధించింది.గురువారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై-గుజరాత్ తలపడనున్నాయి.ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత..ఈనెల 15న ఇదే వేదికపై ఢిల్లీతో జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
Comment List