రాజ్యాంగం పై అవగాహన అవసరం : నరసింహారావు
లోకల్ గైడ్, హైదరాబాద్ :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి నెలకొన్న పరిస్థితుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఆల్ ఇండియా డిఫరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని జాతీయ చీఫ్ ప్రధాన కార్యదర్శి నరసింహారావు చెప్పారు సోమాజిగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్స్ ఆల్పసంకాలకు తమ ఐక్యత బల నిరూపించి రాజ్యాంగాన్ని కాపాడుదాం భారతదేశాన్ని కాపాడుదాం అని నినాదంతో మహాపురుషుడు మహాత్మ జ్యోతి పూలే గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ రథయాత్ర జయప్రదం చేయాలని ఆయన కోరారు జాతీయ ప్రధాని కార్యదర్శి జనరల్ డిఫెన్స్ ఫెడరేషన్ పి జాన్ పాల్ మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ప్రసాదించిన రాజ్యాంగ విలువలను బడుగు బలహీన వర్గాలతో పాటు ఏసీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్స్ అల్పసంఖ్యాకులకు తెలియజేయడానికి దక్షిణ భారత రథయాత్రను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు నేషనల్ సెక్రెటరీ జనరల్ జి శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. సమస్త హక్కులతో కూడిన ప్రజాపాలన ప్రజలకు తెలియజేస్తామని ఆయన చెప్పారు అంబేద్కర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజలింగం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని కాపాడుదాం భారతదేశాన్ని కాపాడుదాం ఈ దక్షిణ భారత రథయాత్ర నిర్వహించాలని సంకల్పించామని చెప్పారు 120 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర నుండి ఈ రథయాత్ర ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతం నుండి కేరళ కర్ణాటక రాష్ట్రల ద్వారా మహారాష్ట్రలోని నాగపూర్ నందు గల ప్రాముఖ్యత స్థలం దీక్ష భూమి వరకు ఈ రథయాత్ర కొనసాగించబడుతుందని ఆయన చెప్పారు ఈ సమావేశంలో కోశాధికారి పి కన్నయ్య మణికుమార్, మహమ్మద్ సన్నుల ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ డీ. రమేష్, పద్మ ,విజయలక్ష్మి, యాదగిరి తో పాల్గొని ప్రసంగించారు
Comment List