వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక* 

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక* 

భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్

లోకల్ గైడ్: వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక అయ్యారు. స్టాటిస్టిక్స్ మరియు అనాలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది.  కోర్సు లో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో  చదువుకొని అందులో చేసిన ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఆధారంగా ఈ ఫెలోషిప్ కు ఎంపిక చేశారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫెలోషిప్ కోసం 2600 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 33 మంది ప్రభుత్వంలో పని చేసిన అధికారులను ఎంపికగా చేశారు. కాగా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్ కావడం గమనార్హం. ఫెలోషిప్ లో భాగంగా వాషింగ్టన్ డిసీలో తొమ్మిది రోజుల పాటు నేరుగా ట్రైనింగ్ పొందేందుకు రావాలంటూ వరల్డ్ బ్యాంక్ అధికారులు కృష్ణ భాస్కర్ కు ఆహ్వానం పంపారు. ఆరు నెలల కోర్సులో భాగంగా ప్రత్యేక శిక్షణ తదుపరి డిజిటల్ అనుబంధంగా ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ కు ఎంపికైన కృష్ణ భాస్కర్  అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్సు కు సంబంధించిన వ్యయం మొత్తం వ్యయం మొత్తం వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది. స్టాటిస్టిక్స్ మరియు అనాలటిక్స్ సంబంధించి అనుబంధాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించాలనేది వరల్డ్ బ్యాంక్ ఆలోచన. ఈనెల 18 నుంచి 27 వరకు అమెరికాలో ప్రత్యక్ష కోర్సు జరుగనుంది. కృష్ణ భాస్కర్ కు ఉపముఖ్యమంత్రి అభినందనలు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ఎంపికైన తన స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ను గురువారం అసెంబ్లీ ఆవరణలో అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకరు ఎంపిక కావడం అది మన రాష్ట్రానికి చెందిన ట్రాన్స్కో సీఎండి కావడం పై హర్షం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి