కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో ఉద్యమాలు మరింత ముందుకు పోతాయని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి అన్నారు.జనగామ పట్టణ కేంద్రంలోని ఏసి రెడ్డి నగర్ లో 2021 ఆగస్టు 28న అమరజీవి ఎసిరెడ్డి నరసింహారెడ్డి సంస్మరణ సభ సందర్భంగా నాటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిపిఎం ఎదుగుదలను సిపిఎం పోరాటాలు ఉద్యమాలను అణిచివేయాలని కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అక్రమంగా తనతోపాటు మరో 16 మందిపై పెట్టించడం జరిగింది.ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన విచారణలో సరియైన సాక్షాదారాలు లేనందున ఈరోజు హనుమకొండలోని ఉమ్మడి జిల్లా జిల్లా కోర్టు కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం జనగామ జిల్లాలో పోరాటాలు రైతాంగ పోరాటాలు స్థానిక సమస్యలపై అనేక సంవత్సరాలుగా పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు రాస్తారోకోలు ధర్నాలు భారీ ర్యాలీలో సభలు నిర్వహించిందని సిపిఎం ఎదుగుదలను అణచివేయాలని చూసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశ అడియాశలు అయ్యాయి జనగామలో తన అడ్రస్ లేకుండా పోయాడని ఈ సందర్భంగా తెలిపారు కమ్యూనిస్టులను అనుచాలని చూస్తే అది ఎవరి తరం కాదని కమ్యూనిస్టులు కేసులకు జైలుకు నిర్బంధాలకు భయపడరని దాటించారు అమరుల త్యాగాలు పోరాటాలతో జనగామ ప్రాంతంలో సిపిఎం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజా సమస్యల పరిష్కారంలో అగ్రభాగాన సిపిఎం ఉంటుందని ఈ సందర్భంగా వారు వివరించారు. కేసు వాదించిన సీనియర్ న్యాయవాది ఎన్నాంశెట్టి వేణుగోపాల్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ సిపిఎం నాయకులు మారుబోయిన మల్లయ్య పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత బూడిది అంజమ్మ వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్ గుంటి పెళ్లి బాలరాజు పల్లెర్ల శంకర్ చీర రజిత బిట్ల లచ్చమ్మ మేడ నరసింహులు గుండె విజేందర్ మంద నరసింహులు కొత్తపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.
Comment List