జిల్లా ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .
హోళీ వేడుకలు ఇతరులకు హాని కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదు ఆకతాయిల పైన షి టీమ్ బృందాల నిఘా ఏర్పాటు .
లోకల్ గైడ్ తెలంగాణ,నల్లగొండ జిల్లా బ్యూరో:
హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు హాని కలిగించకుండా జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ కోరారు.గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికి హోళీ పండుగ శుభాకాంక్షల తెలియజేస్తూ పండుగ ఉత్సవాలు జరుపుకునే యువత ప్రమాదాలకు దూరంగా ఉండాలని అన్నారు.మద్యం తాగి వాహనాలు నడపరాదని,డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లు నిర్వహిస్తాం అన్నారు.మహిళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఎవరైనా ఆకతాయిల మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.వారి పట్ల షి టీమ్ బృందాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దు అని కోరినారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దు అన్నారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా చర్యలు తప్పవు అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పి శరత్ చంద్ర పవర్ విజ్ఞప్తి చేసినారు.
Comment List