ఒత్తిడి లేకుండా
'పది' పరీక్షలు విద్యార్థులు ప్రశాంతంగా రాయాలి
పరకాల ఆర్డిఓ నారాయణ
లోకల్ గైడ్, శాయంపేట :
విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని పరకాల రెవెన్యూ డివిజన్ అధికారి నారాయణ అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే (బాయ్స్) పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి పరకాల ఆర్డిఓ నారాయణ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులకు తీసుకురావడంతో పాటు శాయంపేట మండలానికి మంచి పేరు తేవలన్నారు. పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్లు వాడొద్దని, స్నేహితులతో కలిసి బయట తిరగరాదని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి, 'పది'లో 10/10 మార్కులు సాధించి పాఠశాలలకి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి బిక్షపతి, మండలంలోని వివిధ పాఠశాలలకి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మహాత్మా జ్యోతిరావు బాపూలే పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సుభాష్ పాల్గొన్నారు
Comment List