జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళ  

జిల్లా ఉపాధి కార్యాలయం లో జాబ్ మేళ  

లోకల్ గైడ్,మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:

జిల్లా ఉపాధి కార్యాలయo, మహబూబాబాద్ ఆధ్వర్యంలో  వై.యస్.కే.ఇన్ఫో టెక్  ప్రైవేట్ లిమిటెడ్ , రంగారెడ్డి, హైదరాబాద్ నందు  గల  ఖాళీలను నింపుటకు అర్హత  కల్గిన నిరుద్యోగ  స్త్రీలకు మాత్రమే  ఇంటర్వ్యూలు నిర్వహించుటకై 12.03.2025 తేదీన జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి   టి.రజిత   నేడు ఒక ప్రకటనలో తెలిపారు. 18-28సంవత్సరాల మధ్య వయసు కలిగి యుండి 10th, ఇంటర్, డిగ్రీ(పాస్/ఫెయిల్) విద్యార్హత తో ఆసక్తి గల స్త్రీలు దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. అర్హత ఆసక్తి కల్గిన స్త్రీలు తేది: 12.03.2025 న జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం,   రూమ్ నెం.25, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము, కురవి రోడ్ ,  మహబూబాబాద్ .అడ్రస్ నందు ఉదయం 10.30 గం.ల నుండి మద్యాహ్నం 2.00 గం.ల వరకు  జరుగు జాబ్ మేళాకు అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు / రెజ్యుం తో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు.
మరిన్ని వివరాలకు  ఫోన్ నెం : 7093514418  ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News